ఉగ్రవాదులతో కలసి పాకిస్తాన్ ఆర్మీ…!

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ బుద్ధి చెబుతోంది. మంగళవారం అర్దరాత్రి దాటిన తరవాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది…పీఓకేలోనూ ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ గుట్టుగా కాకుండా బహిరంగంగానే వారి మద్దతు ఎలా ఉందో చూపిస్తోంది.

తాజాగా భారత్ మెరుపు దాడిలో గాయపడిన ఉగ్రనేతలను, ఉగ్రవాదులను పాకిస్థాన్ ఆర్మీ సీనియర్ అధికారి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బహల్పూర్ ఆస్పత్రికి వెళ్లి ఉగ్రవాదుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. మరోవైపు జైషై మహ్మద్ ప్రధాన కార్యాలంపై దాడి చేసిన తరవాత కొందరు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైషే వస్తోంది… నీకు చావు వచ్చింది భారత్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక పార్టీ ఆర్మీ ఉగ్రవాదులను పరామర్శిస్తుండటంతో ఆ దేశం ఉగ్రవాదులకు ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది….

చైనా వక్రబుద్ధి…

ఉగ్రవాదం నడ్డివిరిచేందుకు భారత్ తీసుకున్న సైనిక చర్యకు సమర్ధిస్తూ పలు ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తుంటే, చైనా స్టేట్ మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించి అభాసుపాలైంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానాలంటూ భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది..పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ”గ్లోబల్ టైమ్స్” కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌ ఫోటోలంటూ కుప్పకూలిన విమానాల పాత ఫోటోలను చూపించింది. ఈ కథనంపై చైనాలోని ఇండియన్ ఎంబసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ”డియర్ గ్లోబల్ టైమ్స్.. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిందిగా మేము సిఫారసు చేస్తున్నాం” అని సోషల్ మీడియా ఫోస్ట్‌లో పేర్కొంది..కాగా, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సైతం “గ్లోబల్ టైమ్స్” కథనంలో పాత ఫోటోలను ప్రస్తుత ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించినట్టు నిర్ధారించింది. ఇందులో ఒక ఫోటో 2024 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మిగ్-29 విమానం కూలిపోయినప్పటికి కాగా, రెండవది 2021లో పంజాబ్‌లో ఐఏఎఫ్ మిగ్-21 కుప్పకూలినప్పడిదిగా తేల్చింది.

ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మందిని కాల్చిచంపిన ఘటనను ”గ్లోబల్ టైమ్స్” దృష్టికి చైనాలోని ఇండియన్ ఎంబసీ తీసుకువచ్చింది. ”ఈ అంశంలో వాస్తవాలేమిటో మీ దృష్టికి తెస్తున్నాం. 2025, ఏప్రిల్ 22న పాకిస్థాన్, పాక్‌లో శిక్షణ పొందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో పహల్గాం వద్ద టూరిస్టులపై పాశవిక దాడి చేశారు. మతం అడిగి మరీ 26 మందిని (వీరిలో ఒక నేపాల్ జాతీయుడు ఉన్నారు) తుపాకులతో తలలకు గురిపెట్టి కుటుంబ సభ్యుల ముందే కాల్చిచంపారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై దాడి తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన దాడి ఇది” అని తెలిపింది..