చేతగాని ఆర్మీ… భారత్‌ను రెచ్చగొట్టి తమ దేశాన్ని యుద్ధం అంచులకు తెచ్చారు… పాకిస్తాన్ జనాలు తిట్లు….

భారత డిఫెన్స్ సిస్టం దీటుగా ఎదురుకొవడమే కాకుండా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలాగే పాక్ ఏ మాత్రం సమయం ఇవ్వకుండా భారత దాడి చేయడంతో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికు ముందే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. దాదాపు సగానికి పైగా దేశాలు పాక్ కు మద్దతు ఇవ్వలేదు. తాజాగా మరో దేశం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిలిచింది. శుక్రవారం ఉదయం తాజా పరిస్థితులపై స్పందించిన ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) నేతలు సంచలన స్టేట్ మెంట్ విడుదల చేశారు.

భారత్, బలుచిస్తాన్ కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న దాడులకు సహకరించొద్దని పస్తూన్‌ తెగల వారికి ఆఫ్ఘనిస్తాన్‌ ప్రకటించింది. పాక్‌ ఆర్మీ ఆటలో మనం పావులు కావొద్దనని పేర్కొంది. అలాగే పాక్‌ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు అంటూ తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో పాక్ ప్రస్తుతం ఏకాకిగా మారిపోయింది. ఇదిలా ఉంటే శత్రువుల వల్ల భారీ నష్టాలు సంభవించిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములకు మరిన్ని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధం, స్టాక్స్ పతనం మధ్య, అంతర్జాతీయ భాగస్వాములు ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడాలని మేము కోరుతున్నాము. అని పాకిస్తాన్ ఆర్థిక విభాగం వరల్డ్ బ్యాంక్ ను ట్విట్టర్ ద్వారా కోరింది.

చేతగాని ఆర్మీ… భారత్‌ను రెచ్చగొట్టి తమ దేశాన్ని యుద్ధం అంచులకు తెచ్చారు..

భారత్‌ను రెచ్చగొట్టి తమ దేశాన్ని యుద్ధం అంచులకు చేర్చిన పాక్ ఆర్మీపై అక్కడి ప్రజల్లోనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆర్మీ చెబుతున్న అబద్ధాలను ఈసడించుకుంటున్న జనాలు తమ ఆక్రోశాన్ని నెట్టింట వెళ్లగక్కుతున్నారు…పాక్ ఆర్మీ చేతకాని తనాన్ని తిట్టిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా వీడియోలో ఓ పాకిస్థానీ తమ దేశ ఆర్మీని సన్నాసులంటూ తిట్టిపోశాడు.

పాక్ ఆర్టిలరీ దాడులకు ప్రతిగా భారత్.. దాయాది దేశంలోని గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అయితే, ఈ దాడులను కప్పిపుచ్చుకునేందుకు, తమ చేతకాని తనాన్ని కవర్ చేసేందుకు ఆర్మీ అధికారులు స్థానికులకు రకరకాల కథలు వినిపిస్తున్నారు. రావల్పిండిలో జరిగిన భారత దాడిని పిడుగుపాటుగా స్థానికులకు చెప్పుకున్నారు. దీనిపై ఓ పాకిస్థానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట వీడియో పెట్టాడు.

వీళ్లెంత సన్నాసులు.. అక్కడ పిడుగుపడిందని చెబుతున్నారు. ఇలాంటి అబద్ధాలు చెబుతున్నందుకు వీళ్లకు సిగ్గు ఎందుకు లేదో” అంటూ వీడియో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం అనేక వేదికల్లో వైరల్‌గా మారింది. ఆర్మీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి చిహ్నంగా నిలిచింది. భారత్‌ను బూచిగా చూపించి ప్రజల్లో తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నించే పాక్ ఆర్మీకి ఈసారి మాత్రం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.

కాగా, అంతకుముందు ఇస్లామాబాద్‌కు చెందిన లాల్ మసీద్ మత పెద్ద కూడా పాక్ ఆర్మీపై మండిపడ్డాడు. భారత్‌తో యుద్ధం జరిగితే మీరు పాక్ ఆర్మీకి మద్దతు ఇస్తారా అని ఆయన అడగ్గా చాలా తక్కువ మంది తమ చేతులు ఎత్తారు. దీనిపై స్పందించిన ఆయన పాక్ ప్రజలకు ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మధ్య యుద్ధమంటే ఇస్లామిక్ యుద్ధం కాదని ఇప్పుడు అందరికీ అర్థమైపోయిందని తెలిపారు. పాక్‌లో ఉన్న అణిచివేత భారత్‌లో కూడా లేదని వ్యాఖ్యానించారు..