తాము ఖతార్‌ మాదిరి కాదనే విషయాన్ని ఇజ్రాయెల్‌ గుర్తుపెట్టుకోవాలి…పాకిస్తాన్.

ఇరాన్‌ (iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ (Tehran) లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం (Pakistan Embassy) సమీపంలో వైమానిక దాడి (Air Strike) జరిగింది…ఈ దాడిపై పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన ఇజ్రాయెల్‌ (Israel) కు గట్టి హెచ్చరికలు చేసింది. తాము ఖతార్ (Qatar) మాదిరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది.

టెహ్రాన్‌లోని పాకిస్థాన్‌ ఎంబసీకి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయానికి, అధికారులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ సమీపంలోని పలు భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు అధికార వర్గాల సమాచారం. అమెరికా- ఇరాన్‌ల మధ్య సంధి కోసం ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై పాకిస్థాన్‌ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

తాము ఖతార్‌ మాదిరి కాదనే విషయాన్ని ఇజ్రాయెల్‌ గుర్తుపెట్టుకోవాలని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్‌ హెచ్చరించింది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్‌గానీ, అమెరికాగానీ ఇంకా స్పందించలేదు. ఇదిలావుంటే పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్‌ ప్రయత్నాలు చేస్తున్నది. ఇరుపక్షాలు అంగీకరిస్తే అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇస్లామాబాద్ సిద్ధంగానే ఉందని పాకిస్థాన్‌ అధికారులు తెలిపారు.