పాకిస్తాన్ కరాచీ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు స్థానిక ముస్లిం సమాజంలోనే భగవంతుని మహిమపై నమ్మకం కలిగేలా చేసింది…
హిందువులు, హిందూ దేవాలయాలపై అనేక దుర్మార్గ సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. హిందూ దేవాలయాలను కూల్చడం, అపవిత్ర చేయడం వంటి ఘటనలు అక్కడ అరుదు కావు..
మాంసం మార్కెట్ కోసం ఆలయాన్ని కూల్చే ప్రయత్నం..
కరాచీలోని ఓ వృద్ధ శివాలయం మార్కెట్ ప్రాంతం మధ్యలో ఉంది. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య తక్కువ కావడంతో, ఈ ఆలయాన్ని సంరక్షించేవారు తక్కువ. కొందరు మతోన్మాదులు ఈ స్థలాన్ని కూల్చి, అక్కడ మాంసం వ్యాపారం ఏర్పాటు చేయాలని భావించారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆలయాన్ని కూల్చివేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
శివుని మహిమ – జెసిబి విఫలమైంది
ప్రభుత్వ అనుమతి తీసుకున్న వెంటనే, ఒక బిల్డర్ జెసిబి యంత్రంతో ఆలయాన్ని కూల్చడం ప్రారంభించాడు. గోడలు సులభంగా కూలిపోయినా, ప్రధాన శిఖరాన్ని కూల్చే ప్రయత్నంలో యంత్రం పని చేయలేదు. మరొక జెసిబిని తెప్పించినా అది కూడా విఫలమైంది. చివరికి క్రేన్ ద్వారా కూల్చాలని నిర్ణయించారు.
బిల్డర్‌కు ఎదురైన విషాదం
మరుసటి రోజు క్రేన్ తీసుకొచ్చి శిఖరాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుండగా, బిల్డర్‌కు తక్షణం ఫోన్ కాల్ వచ్చింది. అతని కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అప్రమత్తమైన బిల్డర్ పని నిలిపివేసి ఆసుపత్రికి పరుగెత్తాడు. అక్కడ డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
శివుని కలలో సందేశం
అనేక వైద్యుల ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఓ రోజు బిల్డర్ కలలో భోళే శంకర్ దర్శనమిచ్చి, తన ఆలయాన్ని కూల్చే ప్రయత్నానికి శిక్షగా తన కుమారుడు బాధపడుతున్నాడని స్పష్టం చేశారు. ఆలయాన్ని తిరిగి పునర్నిర్మిస్తే తన కొడుకు కోలుకుంటాడని భగవంతుడు ఆశీర్వదించాడు.
పునరుద్ధరించిన ఆలయం, కోలుకున్న కుమారుడు
దీనితో ఆ బిల్డర్ వెంటనే ఆలయాన్ని పునరుద్ధరించే పని ప్రారంభించాడు. తన ఖర్చులతోనే ఆలయాన్ని మరమ్మతులు చేయించి, ఆ ప్రాంతంలో శివుని గౌరవాన్ని తిరిగి స్థాపించాడు. ఇదంతా జరిగిన కొన్ని రోజుల్లోనే అతని కుమారుడు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చాడు.
స్థానికుల మారిన భావన
ఈ సంఘటన తరువాత, ఆ ప్రాంతంలో ఉండే ముస్లింలు కూడా భగవంతుని మహిమను గమనించి “ఓం నమః శివాయ” జపించడం ప్రారంభించారు. భిన్న మతాలలో భగవంతుని శక్తికి మతాల మించిన స్థానం ఉందనే నిజాన్ని వారు అంగీకరించాల్సి వచ్చింది.