శ్రీలంక పై పాకిస్తాన్ గెలుపు…ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ ఇంకా పోటీలోనే..!

మంగళవారం అబుదాబిలో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి పాకిస్తాన్ తమ ఆసియా కప్ ప్రచారాన్ని సజీవంగా ఉంచుకుంది..

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో పాక్‌ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది..పాక్‌ పోటీలోనే.. శ్రీలంకపై విజయం ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో పాక్‌ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది..మెండిస్‌ ఒక్కడే!
పాక్‌ స్టార్‌ పేసర్‌ ఆఫ్రిదీ ఆదిలోనే లంకను కోలుకోలేని ఎదురుదెబ్బ తీశాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే కుశాల్‌ మెండిస్‌(0)ను ఔట్‌ చేశాడు. వచ్చి రావడంతో సిక్స్‌తో ఆకట్టుకున్న నిస్సనక(8)..కీపర్‌ క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో లంక 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..కెప్టెన్‌ అసలంక(20) బౌండరీలతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన రవూఫ్‌ను ఫోర్‌తో ఆహ్వానించిన కుశాల్‌ పెరెరా(15) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో పవర్‌ప్లే ముగిసే సరికి లంక 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హుస్సేన్‌ 8వ ఓవర్‌లో అసలంకతో పాటు శనక(0) వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో లంక 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో పాక్‌ అంచనాలను కమిందు మెండిస్‌ తలకిందులు చేశాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు హసరంగతో 22 పరుగులు, ఏడో వికెట్‌కు కరుణరత్నె(17 నాటౌట్‌) తో కలిసి 43 పరుగులు జోడించాడు..

నవాజ్ 24 బంతుల్లో 38 పరుగులు సాధించగా, తలత్ 30 బంతుల్లో 32 నాటౌట్‌గా నిలిచాడు..

స్కోర్లు బోర్డు..

శ్రీలంక: 20 ఓవర్లలో 133/8 (మెండిస్‌ 50, అసలంక 20, ఆఫ్రిదీ 3/28, హుస్సేన్‌ 2/18),
పాకిస్థాన్‌: 18 ఓవర్లలో 138/5(నవాజ్‌ 38 నాటౌట్‌, హుస్సేన్‌ 32 నాటౌట్‌, తీక్షణ 2/24, హసరంగ 2/27).