పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్లే భారత్ ప్రపంచ వేదికలపై తమను దెబ్బకొట్టిందని అజర్బైజాన్ (Azerbaijan) భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది…ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు సహకారం అందించినందుకే.. షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO)లో పూర్తి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని పేర్కొంది. ఈ చర్యలు బహుపాక్షిక దౌత్య ఉల్లంఘనలేనని ప్రేలాపనలు పేలింది. అంతర్జాతీయ వేదికలపై తమపై భారత్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాము ఇస్లామాబాద్‌తో సంబంధాలు కొనసాగిస్తామని, అది తమ మిత్ర దేశమని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ (Ilham Aliyev) ప్రగల్భాలు పలికారు. రాజకీయంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య లోతైన బంధాలు ఉన్నాయని తెలిపారు.
అయితే చైనాలోని తియాన్జిలో ఇటీవల నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సదస్సులో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ పాల్గొన్నారు. ఈక్రమంలో పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన ఆయన ఇటీవల భారత్‌తో జరిగిన ఘర్షణల్లో విజయం సాధించారని పేర్కొంటూ.. పాక్ ప్రధానిని అభినందించినట్లు సమాచారం. ఆ దేశంతో ఆర్థిక, వాణిజ్య విషయాల గురించి కూడా చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అజర్బైజాన్ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ రెండు దేశాలతో వాణిజ్య, ఇతర సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌లోని పలు సంస్థలు వెల్లడించాయి..
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇతర దేశ నాయకులు హాజరయ్యారు. అయితే పాక్ ప్రధాని షరీఫ్‌ను మోడీ గానీ.. పుతిన్ గానీ పట్టించుకోలేదు. ఇక ఈ సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని తేల్చి చెప్పారు. ఇక పాకిస్థాన్ -భారత్ యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు టర్కీ, అజర్బైజాన్, పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో మానవాళి మనుగడకు ముప్పు ఉంటుందని మోడీ హెచ్చరించారు. ఇక ఈ సమావేేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ చాలా ఉల్లాసంగా కనిపించారు…