అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి. ఉగ్రవాదానికి కట్టడి అవసరమని, భారత్‌కి తాము అండగా ఉంటామని పేర్కొన్నాయి. ఇదే సమయంలో, పాకిస్తాన్ తన స్నేహ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా, మలేషియా, అజర్‌బైజాన్‌లతో పాటు టర్కీతో కూడా సంబంధాలు బలపరుచుకుంటోంది. టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా ఆయుధాల సరఫరా చేస్తోందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
పలు రిపోర్టుల ప్రకారం, టర్కీ నుండి వచ్చిన C-130E హెర్క్యులెస్ కార్గో విమానాలు కరాచీలో దిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు విమానాలు పాకిస్తాన్‌కు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, టర్కీ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ విమానాలు కేవలం ఇంధనం కోసం ఆగాయని, ఆయుధాలు లేదా మిలిటరీ సరఫరాలు లేవని అధికారికంగా స్పష్టం చేసింది. టర్కీ పాకిస్తాన్‌కు మిత్ర దేశంగా ఉన్నా, యుద్ధ వాతావరణంలో తాము ఏ పాత్ర పోషించట్లేదని తెలిపింది. గతంలో కాశ్మీర్ అంశంలో టర్కీ తరచూ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన సందర్భాలు ఉన్నప్పటికీ, భారత్ తక్షణంగా స్పందిస్తూ, కాశ్మీర్ తన దేశ అంతర్భాగమని పేర్కొంది…
టర్కీకి సహాయం..
2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత్ సహాయక చర్యలకు సిబ్బంది, మెడిసిన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీకి పంపించింది. అవన్నీ మరిచి ఇప్పుడు భారత్ శత్రువు పక్కకు చేరి ఆయుధాలు అందిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టర్కీ అధ్యక్ష కార్యాలయ సమాచార విభాగం మాత్రం ఈ వార్తలను ఖండించింది. టర్కీకి చెందిన ఒక కార్గో విమానం ఇంధనం నింపుకోవడం కోసం పాకిస్థాన్‌లో దిగింది. ఆ తర్వాత అది తన గమ్యస్థానానికి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది. టర్కీ పాకిస్థాన్‌కు మిలటరీ కార్గోను డెలివరీ చేసింది. కానీ.. ఆ విషయం బయటకు తెలియడం, అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కి తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు. చైనా పీఎల్-15 లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను పాకిస్థాన్‌కు సరఫరా చేసిందని కూడా వార్తల వచ్చాయి. టర్కీ ఈ వార్తలను ఖండించగా.. డ్రాగన్ మాత్రం స్పందించలేదు..
ప్రపంచ దేశాలన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. టర్కీ, చైనా మాత్రం పాక్‌కు అండగా నిలుస్తున్నాయి. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ తన మిత్ర దేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటుంది. అందులో భాగంగా టర్కీ సాయం కోరిందని వార్తలు వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి రోజు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశంలో ఉన్నారు. పాకిస్థాన్‌కు సాయం చేసే దేశాల్లో టర్కీ ఒకటి. ఇది ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌కు సాయం చేసేందుకు మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలను పంపిందని వార్తలొచ్చాయి..
చైనా సంచలన నిర్ణయం తీసుకుంది…
చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. నిజానికి, జిన్‌పింగ్ పాకిస్తాన్లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి, యుద్ధభూమిలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. కానీ ఇక్కడ, మద్దతు ఇవ్వడానికి బదులుగా, చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది. చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి, రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దశకైనా మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు, పహల్గామ్ దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్దం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటిపై పలుదేశాలు మద్దతు ప్రకటించాయి. భారత్ తప్పకుండా యుద్దానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది. భారత్‌ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్‌కు తెలుసు. అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్టు పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. యుద్దం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని, అందుకే యుద్దాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత్ దాడి చేస్తే మాత్రం తాము యుద్దం చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా కోరింది.
భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది. చాలా దేశాలు పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే భారత్‌తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. పాకిస్తాన్‌కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది. ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్‌కు పంపించింది టర్కీ. టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది. బాయ్ కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది. టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపు ఇచ్చాయి. పాకిస్తాన్‌కు చైనా నుంచి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది.
భారత్‌కు అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది. పహల్గామ్ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది. భారత్ , పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని కోరింది. కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. భారత్-పాక్ రెండింటికీ పొరుగు దేశంగా, చైనా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని, చర్చలు, సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్‌కు అండగా నిలుస్తోంది. 26 రాఫెల్ మెరైన్ యుద్ద విమానాల కోసం భారత్‌తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది.