జనగామ జిల్లా:-
భూ భారతిలో జరుగుతున్న స్కామ్ ను ప్రతీ క్షణం ప్రజలకు తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులకు అభినందనలు…
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందు చూపుతో ధరణి పోర్టల్ ను ప్రారంభించి సమర్దవంతంగా అన్ని హంగులతో అమలు చేసి భూ క్రయ, విక్రయదారుల మన్ననలు పొందింది.
ధరణిలో భూముల రికార్డుల నిర్వహణ, అస్తుల రిజిస్ట్రేషన్ కోసం చేసిన స్లాట్ బుకింగ్ లు పారదర్శకంగా జరిగాయి.
పారదర్శకంగా ఉన్న ధరణి స్థానంలో లొసుగులతో కూడిన భూభారతి పోర్టల్ ను ప్రారంబించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
అట్టి లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు కాంగ్రెస్ నాయకుల అండదండలతో అక్రమాలకు తెరలేపారు.
ఈ అక్రమాల వలన ప్రభుత్వ ఖజానా కు కొన్ని కోట్ల నష్టం వాటిల్లింది.
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన అక్రమార్కుల నుండి డబ్బులు రికవరీ చేయవలసిన ప్రభుత్వం భూ క్రయ, విక్రయధారుల వద్ద వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది…
డబ్బులు కట్టాలంటూ రైతులకు రికవరీ నోటీసులు పంపించడం సిగ్గు చేటు…
రూతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వెంటనే రైతులకు పంపించిన నోటీసులు వెనక్కి తీసుకుని అక్రమార్కుల వద్ద డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్..
జరిగిన అక్రమాల పై వివిధ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు లోకాయుక్త స్పందించే వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడం విచారకరం.
లోప భూయిష్టంగా తయారు చేసి రాష్ట్ర ఖజానాకి జరిగిన నష్టానికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే భాద్యత వహించాలి.
తప్పుల తడకగా ఉన్న భూ భారతిని తొలగించి మళ్ళీ ధరణి ని కొనసాగించాలని డిమాండ్….
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి అక్రమార్కులు ఎంత పెద్ద నాయకులు అయినా సరే వారి పై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ ఖజానాకు రావలసిన డబ్బును రికవరి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959