పన్నీర్ సెల్వం కార్ లో జయలలిత ఫొటో వెళ్లిపోయి స్టాలిన్ ఫొటో వచ్చే..!

అన్నాడీఎంకే పార్టీలో ఒకప్పుడు జయలలితకు అత్యంత నమ్మకస్తుడు పన్నీర్ సెల్వం. పలు కారణాల వల్ల సీఎం సీటు నుంచి జయలలిత దిగిపోయిన రెండుసార్లు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉంటూ జయలలిత తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా పన్నీర్ సెల్వమే సీఎం అయ్యారు. జయలలిత చనిపోయాక తన కారులో జయలలిత ఫొటో పెట్టుకున్నారు పన్నీర్ సెల్వం. జయలలితపై తనకున్న గౌరవాన్ని, భక్తిని ఈ విధంగా ఆయన చాటుకున్నారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్. అయితే, ఇప్పుడు తన కారులో అమ్మ ఫొటోను పన్నీర్ సెల్వం తీసేశారు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫొటో వచ్చింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు, మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అధికార పార్టీ డీఎంకేలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎంకేలో చేరినప్పటికీ.. ఓపీఎస్ తన కారులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను అలాగే ఉంచారని, ఆమె పట్ల తనకు గౌరవం ఎప్పటికీ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలు అందరకీ చేరడానికి ముందే కారులో నుంచి జయలలిత ఫొటో వెళ్లిపోయి స్టాలిన్ ఫొటో వచ్చేసింది.