పెద్ది సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
*• సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 పెంచుకునేందుకు ఉత్తర్వులు.*
*• 3వ తేదీ రాత్రి ప్రీమియర్ షో టికెట్ ధరలు రూ.600 పెంచుకునేందుకు అనుమతి.*
*• 10 రోజుల వరకు ధరల పెంపుకు అనుమతి.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే అధునాతన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రతీ టికెట్పై అదనంగా రూ. 125 వరకు పెంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, సినిమా విడుదల కాబోయే ముందు రోజు అంటే జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ఏకంగా రూ. 600 వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది…పెద్ది సినిమాకు(Peddi Movie Ticket Price) ఉన్న విపరీతమైన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు, పంపిణీదారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి సినిమా ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి వారం రోజుల్లో థియేటర్లలో సినిమా చూడాలనుకునే అభిమానులపై ఈ అదనపు ధరల భారం తీవ్ర ప్రభావం చూపనుంది..