నేను ఉన్నా.. చింత వద్దు’ కళ్లలో నీళ్లు పెట్టుకుంటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన్న కేసీఆర్..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) దశదిన కర్మకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్వయంగా హాజరయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకున్న ఆయనకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కేసీఆర్ తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను అప్యాయంగా పలుకరించి ‘నేను ఉన్నా.. చింత వద్దు’ అంటూ భరోసానిచ్చారు. ఆ వెంటనే సంతోష్ రావు (Santhosh Rao) నుంచి చెక్బుక్ తీసుకుని సుదర్శన్ రెడ్డి సతీమణికి పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షల చెక్ రాసి వారికి అందజేశారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కళ్లలో నీళ్లు తిరుగుతున్నా తను దు:ఖాన్ని అదిమిపట్టుకుని దిగమింగుతూ.. అక్కడి నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు…
బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం.. అందజేశారు. ఇందులో పెద్ది సుదర్శన్రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు అందించాలని.. ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెద్ది కుటుంబసభ్యులకు వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు.పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…