ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్..

22వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది. అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్‌ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. చమురు, గ్యాస్ కొరతతో ఇండియాలో కూడా సంక్షోభం నెలకొంది..

ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బ తింటుందని, వరల్డ్ సప్లై చైన్‌కు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రశంసించారు. యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం..

ప్రాంతీయ శాంతి, భద్రతల కోసం దౌత్యపరమైన పరిష్కారాల ఆవశ్యకతను మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా నౌరూజ్ (పర్షియన్ నూతన సంవత్సరం), ఈద్ పండుగ శుభాకాంక్షలను మోదీ ఇరాన్ అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ పండుగ సీజన్ ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు..

దౌత్యమే ఏకైక మార్గం
పశ్చిమాసియాలో ఏవైనా వివాదాలు ఉంటే వాటిని చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ తన పాత వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు పోవడం పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ప్రధాని మోదీ ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ వంటి దేశాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపి, ప్రాంతీయ శాంతి కోసం కృషి చేస్తున్నారు.

ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై దాడులు జరిగినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ ఫోన్ కాల్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో భారత్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది..