భూదాన్ పోచంపల్లిలొ పర్యటించనున్న సుందరిమణులు..

*యాదాద్రి భువనగిరి జిల్లా*

యునెస్కో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలొ 25 మంది,,, యాదాద్రి దేవాలయంలొ కరేబియన్ సుందరిమణులు పదిమంది.. మొత్తం జిల్లాల 35 మంది సుందరిమణుల నేడు పర్యటించనున్నారు..

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అతిథులకు హ్యాండ్లూమ్ ఇక్కత్ థీమ్ను
ఆకట్టుకునేలా గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సిద్ధం చేశారు.

ఇక్కత్ వస్త్రాల్లో కేవలం చీరలు మాత్రమే కాకుండా 25 రకాలుగా ఇండో-వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలంకరణ ప్రదర్శన స్టాళ్లలో ఏర్పాటు చేసారు..

మిస్ వరల్డ్ పోటీదారుల పరిశీలన నిమిత్తం చేనేత వస్త్రాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా పది స్టాళ్లను ఏర్పాటు..

ఆరు స్టాళ్లలో ఇక్కత్ డిజైన్ వస్త్రాలు ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులతో టై అండ్ డై నేత విధానాన్ని ప్రదర్శించనున్నారు.

పోచంపల్లి పట్టుచీర, ఒక స్టాల్లో పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల, నారాయణపేట జిల్లాలకు చెందినచెందిన కళాత్మక వస్త్రాలను ఒక్కో స్టాల్లో
ప్రదర్శించడానికి అధికారులు సిద్ధం చేశారు.

పర్యాటక కేంద్రం ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా సుందరీమణులకు బొట్టుపెట్టి
పూలమాలలు వేసి మ్యూజియానికి తీసుకెళ్లనున్నారు.

యాదాద్రి దేవాలయనికి
కరేబియన్ దీవులకు చెందిన 10 మంది సుందరీమణులు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట కొండపైకి సాయంత్రం ఐదు గంటలకు
చేరుకుంటారు.

కొండపై ఉన్న దేవస్థాన అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని బ్యాటరీ వాహనాల్లో ఆలయ ప్రాంగణానికి చేరుకొని స్వామివారికి అఖండ దీపం ప్రాంగణం వద్ద నూనె
సమర్పిస్తారు.

తూర్పు రాజగోపురం నుంచి
ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం అనంతరం రాజగోపురం మీదుగా బయటకు వచ్చి ప్రసాదం, చిత్రపటాలు స్వీకరించనున్నారు….

సుందరీమణుల రాక సందర్భంగా జిల్లాలో ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేసిన అధికారులు.