పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటు సంచలన వ్యాఖ్యలు ..!

పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
“అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!” అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కొన్ని రాజకీయ పరిణామాల కారణంగానే కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందని తెలిపారు. “అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది. కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగింది అని నేనే చెబుతున్నాను” అన్నారు.
తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు.
“వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. సీఎం మాటలను మంత్రులే లెక్క చేయడం లేదు” అని విమర్శించారు.
తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, “జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను” అని పోచారం వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన సమయంలోనే ఆయనను నేరుగా ప్రశ్నించానని చెప్పారు.
“నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా?” అని సీఎంను అడిగినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.