*సూర్యాపేట జిల్లా…*
హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొనుగోడు,, కుతుబ్షా పురం గ్రామాలలో ప్రచారంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. పాల్గొన్న హుజూర్ నగర్ BRS సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, BRS రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి. స్థానిక నేతలు.. మాజీ ప్రజాప్రతినిధులు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS కు ఆదరణ పెరిగింది..
కాంగ్రేస్ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్నారు..
అనాడు అరవై ఏండ్లలో అంగుళం అభివృద్ధి కూడా చేయలేదు..
ఇప్పుడు రెండేళ్లలో రూపాయి పనికూడా చేసిన పాపానపోలేదు..
కానీ కెసిఆర్ పదేండ్ల లో చేసిన అభివృద్ధి కండ్లముందే కనబడుతుంది..
కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెసోల్లు సక్కగా కొనసాగిస్తలేరు..
ఇంకా కొత్తగా ఏదో చేస్తామంటే నమ్ముతారా..
కెసిఆర్ ప్రజల కడుపు నింపితే.. కాంగ్రేస్ జేబులు నింపుకునే పనిలో ఉంది..
ఇచ్చిన హామీలు మోసమని తేలిందని కుట్రలు చేస్తున్నారు..
ప్రశ్నిస్తున్న వారిపై కేసులు, పోలీస్ స్టేషన్ అని బయపెడుతున్నారు..
అనేకచోట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహావరిస్తున్నారు..
పలుచోట్ల ఏస్ ఐ లు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు..
అమాయకులను స్టేషన్ కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారు..
రౌడీ షీటర్లుగా ఉన్న కాంగ్రేస్ గుండాలను దర్జాగా తిప్పుతున్నారు..
అన్నీ ఎదుర్కుంటూ BRS నేతలు సైనికుల్లా పనిచేస్తున్నారు..
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవు..
రేవంత్ మాయమాటలతో మోసం చేశాడని ప్రజలకు అర్థమైంది..
కేసీఆర్ ను వదులుకున్నామననే పశ్చాత్తాపం అందరిలో మొదలైంది..
అందుకే స్థానిక పోరులో బిఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది..
మరో రెండేళ్లలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే..
ఈ విషయాన్ని ప్రజలే ముక్తకంఠంతో చెబుతున్నారు..