అందం, అభినయం పుష్కళంగా ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడుతుంటారు. సినీ రంగంలో స్థిరపడాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలని కొందరు భామలు నిరూపిస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు ప్రగ్యా జైస్వాల్. అప్పుడెప్పుడో కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్య.. ఒకటి ఆరా సినిమాలు తప్పించి పెద్దగా క్లిక్ కాలేదు…







ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేసిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015లో బిగ్బాస్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగువారిని పలకరించారు ప్రగ్య. ఈ క్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచెతో ఈ ముద్దుగుమ్మకు బ్రేక్ వచ్చింది. అందులో జమీందారు కూతురిగా, రాయల్ లుక్లో కనిపించిన ఈ అమ్మడు అందరి కళ్లలో పడ్డారు. ఈ దెబ్బతో తెలుగులో ప్రగ్యా జైస్వాల్ టాప్ హీరోయిన్ అవుతారని అంతా అనుకున్నారు.