భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా‌ రికార్డు..!

భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా‌ రికార్డు సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగుచిని వరుసగా గేమ్‌ల్లో ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది…

మహిళల సింగిల్స్ మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు దూకుడుగా ఆడింది. క్రాస్‌కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన స్మాష్‌తో యమగుచిపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో చివరి వరకు హోరాహోరీ పోరు సాగినా.. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధించిన సింధు 21-17తో గేమ్‌ను తన ఖాతాలో వేసింది. మొదటి గేమ్‌ను గెలిచిన ఊపుతో రెండో గేమ్‌లోనూ సింధు మరింత దూకుడు పెంచింది. యమగుచి నెట్ గేమ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. 21-17తో రెండో గేమ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.