పార్లమెంట్ కాంప్లెక్స్ గొడవ కేసులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్లను జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది..నాగాలాండ్ ఎంపీ ఫాంగ్నోన్ కొన్యాక్తో అనుచితంగా ప్రవర్తించారని NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మహిళలకు ఉన్న గౌరవం, సమానత్వం, గౌరవాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. నాగాలాండ్కు చెందిన రాజ్యసభ సభ్యురాలు ఫాంగ్నోన్ కొన్యాక్ పార్లమెంట్ కాంప్లెక్స్లో నిరసన తెలుపుతున్నప్పుడు రాహుల్ గాంధీ తన దగ్గరికి వచ్చి అరవడం ప్రారంభించారని ఆరోపించారు. దీంతో ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని గుర్తించిన మహిళా కమిషన్ స్వయంగా లేఖ రాశారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.