ఏపీకి వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్…!

ఏపీకి వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వాయుగుండం ముప్పు ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం కారణంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్నింటికి ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో మొదలైన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరేబియా సముద్రంలో కూడా ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది..