బస్సు ఆగ్ని ప్రమాదంలో ఆరుగురు తెలంగాణ వాసులు..!

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగ్నికి ఆహుతైంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా బస్సును ఓ బైక్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు అంతా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించినట్లు సమాచారం…

రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్‌ చెప్పాడు: కర్నూలు ఎస్పీ.

బస్సు నడిపిన డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు: రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్‌ చెప్పాడు: కర్నూలు ఎస్పీ
అంతకుముందే రోడ్డు ప్రమాదంలో బైకు పడిపోయి ఉండవచ్చు.బైకు పైనుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్‌ చెప్పాడు.
అసలు ఏం జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది..

చనిపోయినవారిలో ఆరుగురు తెలంగాణ వాసులు : ఏపీ హోంమంత్రి అనిత.

బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నపిల్లలున్నారు ..

ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది చనిపోయారు .
23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు డ్రైవర్లు బయటపడ్డారు..
గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి
ప్రమాదంపై 16 ఫోరెన్సిక్‌ బృందాలు ఏర్పాటు చేశాం అన్నారు..
బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నాం
చనిపోయినవారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌ వాసులు
చనిపోయినవారిలో ఆరుగురు తెలంగాణ వాసులున్నారు..మృతుల్లో ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక వాసులు..మృతుల్లో ఒకరు ఒడిశా, ఒకరు బిహార్‌ వాసి ఉన్నారు
మరో మృతదేహాన్ని గుర్తుపట్టాల్సి ఉంది..
ఇద్దరు బస్సు డ్రైవర్లు పోలీసుల అదుపులో ఉన్నారు..ఘటనపై కేసునమోదు చేశాం.. విచారణ జరుగుతోంది :