వచ్చే ఆరు రోజులపాటు తెలంగాణలో వర్షాలు..

వచ్చే ఆరు రోజులపాటు తెలంగాణలో వర్షాలు.

* తెలంగాణలో వచ్చే ఆరు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16-21వ తేదీల మధ్య కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది..

ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఒడిశా వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటనలో తెలిపిం ది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావశం ఉన్నదని వెల్లడించింది. ఆదివారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసినట్టు తెలిపింది…సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మ ల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, యాదా ద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జగిత్యాల, రా జన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేసినట్టు పేర్కొన్నది..