వర్షం కోసం గాడిదలకు పెళ్లి
వర్షాల కోసం పాతకాలపు మనుషులు వివిధ రకాల వాటికి పెళ్లిళ్లు చేసి వర్షాలు కురిసేలా చూడమంటూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తుంటారు… మరి కొంతమంది కప్పలకు నీరు అభిషేకం చేస్తూ వర్షం కురవాలని ప్రార్థిస్తారు.. మరికొందరు రకరకాల విధంగా రూపంలో వారికి భక్తిని చాటుతూ వర్షం కోసం పాటలు పాడుతూ ఉంటారు అలాంటి గట్టనే ఇది ఒకటి..
వర్షాలు కురవకపోవడంతో కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామస్తులు గాడిదలకు వివాహం జరిపించారు.
మగ గాడిదకు కాంతేశ్ అని, ఆడ గాడిదకు కస్తూరి అని నామకరణం చేసి శాస్తోక్తంగా వివాహం జరిపించారు.
పెళ్లికి విచ్చేసిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో ఆనాదిగా వస్తున్ప ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించామన్నారు..
వివాహ వేడుకలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పెళ్లికి హాజరైన అతిథులకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ ఏడాది తగినంత వర్షపాతం లేక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వర్షాలు కురవాలనే ఆకాంక్షతో పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ గాడిదలకు వివాహం జరిపించినట్లు తెలిపారు. శాస్త్రీయంగా దీనికి ఆధారాలు లేకపోయినా, ప్రకృతి అనుకూలించాలని కోరుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు..