భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం మరింతగా బలపడుతుంది. ఇది ఈరోజు సాయంత్రం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రి, ఎల్లుండి తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ వర్షసూచన నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలువులు ప్రకటిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు.
అలాగే సెప్టెంబర్ 24, 2026న
* విశాఖపట్నం
* అనకాపల్లి
* అల్లూరి సీతారామరాజు (ASR)
* తూర్పు గోదావరి
* విజయనగరం
జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.