భారీ వర్షం పడే అవకాశం..!
TG: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వర్షం మొదలైంది. మరోవైపు, రానున్న 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లోనూ 2 గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు.