అత్యవసర సాయానికి 100కు డయల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు (Public Safety Advisory) జారీ చేశారు. వర్షం కారణంగా పలు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు…

సిటీవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆఫీసులనుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మెహదీపట్నంపరిధిలోని పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిల్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు…..

రోడ్లపై భారీగా నీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దాంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు నిలిచిన చోట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని, అత్యవసర సాయానికి 100కు డయల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) కోరారు…