ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుంగిపోయిన ఫ్లోరింగ్.. అధికారులకు తప్పిన పెను ప్రమాదం..!
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం (Big risk) తప్పింది.
https://www.facebook.com/share/v/17q2AVEY4e/
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడలో ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తో పాటు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెళ్లారు. నిర్మాణాలను పరిశీలిస్తున్న క్రమంలో ఒకసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఎమ్మెల్యే, కలెక్టర్ లు క్రింద పడిపోతుండగా సిబ్బంది పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత లోపం వల్లే ఫ్లోరింగ్ కుంగినట్లు సమాచారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు తృటిలో తప్పిన ప్రమాదం. నంది కమాన్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుంగిపోవడంతో అధికారులు, నాయకులు తుళ్లిపడ్డ ఘటన కలకలం రేపింది. నిర్మాణ నాణ్యత లోపంపై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. భయాందోళనకు గురైన స్థానికులు పనుల ప్రమాణాలపై ప్రశ్నలు లేపుతున్నారు.