రాజేంద్రనగర్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వరుసగా చిక్కిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు…!

రాజేంద్రనగర్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వరుసగా చిక్కిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు

ఏసీబీ అధికారులకు వరుసగా పట్టుబడుతున్నా ఏమాత్రం భయం లేకుండా అదే ఆఫీసులో లంచాలు దండుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఓ హోటల్‌పై అధికారులు రైడ్స్ చేయగా, ఆ హోటల్‌పై చర్యలు తీసుకోకుండా ఉండటానికి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కే.రవి కుమార్

రూ.5 లక్షలలో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రవి కుమార్

అలాగే గతంలో కొలతల పుస్తకంలో చేసిన పనిని నమోదు చేయడం కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకొబా

ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును మంజూరు చేయడానికి, రూ15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ ఎల్. బల్వంత్ రెడ్డి

ఓ వ్యక్తి పరిశ్రమకు ఆస్తి పన్ను పెంచకుండా ఉండడానికి రూ.1 లక్ష డిమాండ్ చేసి, అందులో రూ.45,000 తన సహాయకుడు V. రమేష్ ద్వారా తీసుకుంటూ, ఏసీబీ అధికారులకు దొరికిన రాజేంద్ర నగర్ సర్కిల్ బిల్ కలెక్టర్ సి.మధు

ఇలా ఒకే మున్సిపాలిటీ సర్కిల్‌లో వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా, లంచాలు తీసుకోవడానికి వెనకాడని ప్రభుత్వ ఉద్యోగులు.