నా రూల్స్ ఓకే అంటే టెండర్ వేయండి.. రాజగోపాల్ రెడ్డి..

ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఇచ్చిపడేస్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారి తీశారు. ఈ సమయంలో పలుసార్లు సొంత పార్టీని, సీఎంను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డిపై యాక్షన్‌కు డిమాండ్లు వెల్లువెత్తాయి…కానీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కనీసం ఆయనకు నోటీసులు కాదు కదా..ఫోన్ చేసి వివరణ అడిగే సాహసం కూడా చేయలేదు. ఇప్పుడు మరోసారి ఏకంగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ జాన్తానై అంటున్నారు రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణలో వైన్ షాపులు ఉదయం 10.30 నుంచి రాత్రి పది గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. పైగా వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్స్ కూడా నడుస్తాయి. కానీ ఇవన్నీ మునుగోడులో నడవవు అంటున్నారు రాజగోపాల్‌రెడ్డి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఎలా ఉన్నా..తన నియోజకవర్గంలో మాత్రం తానేది చెప్తే అదే రూల్ అంటున్నారు ఎమ్మెల్యే రాజన్న.

తాను చెప్పిన కండీషన్స్‌కు ఓకే అయితే టెండర్లలో పాల్గొనాలని లేకపోతే ఇబ్బందిపడుతారంటూ హుకుం జారీ చేసేశారు. స్థానికులు మాత్రమే వైన్ షాపులకు టెండర్స్ వేయాలని కండీషన్ పెట్టారు. పైగా ఏ మండలం వారు ఆ మండలంలో మాత్రమే టెండర్లు వేయాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. స్థానికులు మాత్రమే టెండర్లు వేస్తే ఆ తర్వాత తాను చెప్పినట్లుగానే వింటారని..అలా అయితేనే బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించొచ్చని రాజగోపాల్ రెడ్డి ప్లాన్‌గా చెబుతున్నారు..