అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతిక రాఖీ పండుగ. ఏడాదంతా ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సోదరుడు, సోదరి కలిసి ఒకరికొకరం తోడంటూ ప్రేమనురాగాలు పంచుకునే వేడుక. సోదరీమణులు రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తే సోదరులు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ భరోసానిస్తారు. ఈ తంతు ఏటా సాగేదే అయినప్పటికీ పోటీ ప్రపంచంలో వృత్తి రిత్యీ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డపటికీ రాఖీలు కట్టేందుకు మహిళలు వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. సోదరి, సోదరుల ఆప్యాయతను కొనసాగిస్తామని చెబుతున్నారు.
అన్నా, చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పర్వదినమే రాఖీ. ఇది ఏడాదికి ఒక రోజు జరుపుకునే వేడుక. రాఖీ పౌర్ణిమ వచ్చిందంటే చాలు. సోదరీమణులు తన సోదరుడికి తప్పకుండా రాఖీ కట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. పెళ్లైన వారైతే అత్తారింటి నుంచి పుట్టింటికి చేరి తనకు రక్షగా ఉండాలంటూ సోదరుడికి ఆత్మీయంగా రక్షాబంధనం చేస్తారు. వారికి నచ్చిన మిఠాయిలు తినిపించి నోరు తీపి చేస్తారు. చెల్లెలు రాఖీ కట్టగానే తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ అన్ని వేళలా అండగా ఉంటానని సోదరికి, అన్నలు, తమ్ముళ్లు భరోసానిస్తారు…
వేడుక తరతరాలుగా వస్తోంది. ఈ పండుగకు సంబంధించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాస భగవా నుడి విష్ణు పురాణంలో రాఖీ పౌర్ణమిని ‘బలేవా’ అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహా విష్ణువు భక్తుడు. ఆయన తన అపారమైన భక్తితో విష్ణువుని తనవద్దే ఉంచుకుంటాడు. విష్ణువు లేని వైకుంఠం వెలవెలబోతుండటంతో శ్రీ మహాలక్ష్మి ‘పౌర్ణమి’ నాడు బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవిని ఏం కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడగ్గా.. లక్ష్మీదేవి మహావిష్ణువును తనతో పంపాలని కోరడంతో వెంటనే అంగీకరిస్తాడు…
రక్షా బంధన్’ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. ‘రాఖీ’ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా, రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు. రాఖీ పండుగను కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
అ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టగా.. దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని ఆమెకు మాట ఇస్తాడు. తదనంతరం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆమెను ఆదుకుంటాడు..
అసలు నేపథ్యం
దేవ దానవులకు ఉధృత స్థాయిలో యుద్దం జరుగుతోంది. త్రిలోకాధిపత్యమే లక్ష్యంగా సాగుతున్న రణరంగంలో రాక్షసుల ధాటికి దేవతలే తల్లడిల్లుతున్న సమయం. అమరావతికి అధిపతి దేవేంద్రుడు సైతం నిస్సహాయస్థితికి లోనై తరుణమది. అసహాయ స్థితిలో తన పరివారంతో సహా అమరావతిలో తలదాచుకున్న దేవేంద్రుడి నిశ్చేష్టతను గమనించిన ఆయన సతీమణి శచీదేవికి ఓ ఉపాయం తడుతుంది. రాక్షస రాజుతో తలపడేందుకు భర్తను సమాయత్తపర్చాలని తలుస్తుంది. లయకారుడైన పరమేశ్వరుడిని, లక్ష్మీనారాయణున్ని ఆరాధిస్తుంది. అనంతరం భర్త దేవేంద్రుని చేతికి రక్షా కంకణం కడుతుంది. ఆ ఉత్తేజంతో రాక్షసులతో యుద్ధం చేసి త్రిలోకాధిపత్యం సాధిస్తాడు దేవేంద్రుడు. అలా శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం కాలక్రమంలో పరిణామం చెందుతూ ప్రస్తుత దశకు చేరుకుంది.
బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు అతనితో పాటే పాతాళ లోకవాసానికి అంగీకరిస్తాడు. భర్త సాహచర్యం కోసం శ్రీమహాలక్ష్మీ రక్షను రూపొందించి బలిచక్రవర్తి చేతికి కట్టి సోదర భావంతో అభ్యర్థించి భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈ కారణంగా రక్షాబంధనానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే రక్షాబంధనం చేసే సమయంలో ‘యేనబద్దో బలీ రాజా దానవేంద్రో మహాబూబలః తేన త్వా మభీబడ్నామి రక్షే మ చలమా చల’ అనే శ్లోక పథనం చేస్తారు…