న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీసుల్లో విఫలమైన భారత ఆటగాళ్లు (Team India) ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి రంజీ బరిలోకి దిగారు. విరాట్ కోహ్లీ మినహా..రోహిత్, పంత్, శుభ్‌మన్, యశస్వి, జడేజా తదితరులు దేశవాళీ క్రికెట్లోకి మళ్లీ అడుగు పెట్టారు. కానీ, అంతర్జాతీయ మ్యాచుల్లో తడబడినట్లుగానే ఇక్కడా ఇబ్బందిపడ్డారు. ఓర్పుగా ఆడి క్రీజ్‌లో పాతుకుపోదామనే ఆలోచన వారిలో పెద్దగా కనిపించలేదు. రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025) ఎలైట్ మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
యశస్వి 4, రోహిత్ 3
జమ్ము కశ్మీర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి తరఫున ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. తొలి రెండు ఓవర్లు ఓర్పుగా ఆడారు. దూకుడుగా ఆడదామని అనుకొనేలోపు జైస్వాల్ (4) ఔటయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ (3) ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్‌కు చేరాడు. షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో పుల్ చేయబోయిన అతడు (Rohit Sharma) మిడాఫ్‌లో దొరికిపోయాడు. కెప్టెన్ అజింక్య రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. 50 పరుగుల్లోపే ఏడు వికెట్లను కోల్పోయిన ముంబయి కష్టాల్లో పడింది.
గిల్ 4, పంత్ 1
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. అతడు రంజీ ట్రోఫీలో పంజాబ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కానీ, 8 బంతులనే ఎదుర్కొని నాలుగు పరుగులు చేశాడు. కర్ణాటక బౌలర్ల దెబ్బకు పంజాబ్ కూడా 30 పరుగుల్లోపే ఆరు వికెట్లను కోల్పోయింది. చివరికి 55 పరుగులకే ఆలౌటైంది. ఇక సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కూడా పోరాడుతోంది. అయితే, యశ్ ధుల్ (44), కెప్టెన్ ఆయుష్ బదోని (35*) ఫర్వాలేదనిపించడంతో దిల్లీ వంద పరుగుల మార్క్‌ను దాటింది. అప్పటికే నాలుగు వికెట్లను కోల్పోయింది. తర్వాత భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (1) బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పంత్ (Rishabh Pant) 10 బంతులు ఆడి కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు.. ఇలా ఉన్నది మి ఆట అంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…