అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భరోసా ఇచ్చారు. పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాల మాటలు ఎవ్వరు నమ్మ వద్దన్నారు.
కరీంనగర్ జిల్లా మాన కొండూరు గ్రామసభలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్, రెడ్డికి,రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి, వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్లోని హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాట్లా డుతూ… ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ పరిశీలి స్తున్నామని చెప్పారు. ఈరోజు దరఖాస్తు ఇచ్చినా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21 నుంచి గ్రామస భలు ప్రారంభమయ్యాయి గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి నాలుగు పథకాలను ఏక కాలంలో అమలు కు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అర్హులైన పేదవారందరికీ నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని, తెలిపారు..
సొంత పార్టీ నేతలే పార్టీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం..!
పటాన్ చెరులో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్ చెరు స్లోగన్తో కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం పాత కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల పంచాయితీని అగ్రనేతలు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చెయాలని రోడ్డుపై కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. అనంతరం క్యాంప్ ఆఫీస్లోని కుర్చీలను ధ్వంసం చేశారు.