భారత్ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండురోజుల పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6గంటలా 40 నిమిషాలకు ఆయన విమానం దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ అంతకుముందే పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. పుతిన్‌కు స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టారు. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను పుతిన్ తిలకించారు. అనంతరం ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకేకారులో వెళ్లారు. గురువారం అధికారిక కార్యక్రమాలేవీ లేనప్పటికీ ప్రధాని మోదీ ఆయన గౌరవార్థం ఈ రాత్రి ఏర్పాటు చేసిన విందులో పుతిన్ పాల్గొంటారు. ఆయన పర్యటన సందర్భంగా పుతిన్‌కు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది..
-400 మిస్సైల్ సిస్టమ్‌ల అదనపు డెలివరీ, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చకు రానున్నాయి. S-400 ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ కోరుతోంది. Su-57 ఫైటర్ జెట్లపైనా చర్చ జరగనుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కంటే Su-57 తక్కువ ధరకు లభిస్తుంది. భారత్‌లోనే తయారీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలన్న అంశంపై ప్రధాని మోదీ, పుతిన్ మధ్య చర్చల తర్వాత క్లారిటీ రానుంది. S-500 సిస్టమ్ భారత్ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిస్సైళ్లను సైతం గాల్లోనే పసిగట్టి ధ్వంసం చేయగలదు.
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పైనా సుంకాల మోత మోగిస్తోంది. ఈ క్రమంలో పుతిన్.. ఇండియా పర్యటనపై అగ్రరాజ్యం ఎలా రియాక్ట్ అవుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి..
శుక్రవారం షెడ్యూల్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం అందుకోనున్నారు. పదకొండున్నరకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జలాంతర్గామి లీజుకు సంబంధించిన ఒప్పందం కూడా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఆ ఒప్పందం విలువ దాదాపు రెండు బిలియన్ డాలర్లు అని సమాచారం. ఈ జలాంతర్గామి కోసం పదేళ్లుగా జరిగిన చర్చలు ఎట్టకేలకు పుతిన్ భారత పర్యటన సందర్భంగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది…