రంగంలో ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం..!.

తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి…

ఎస్‌ఎల్‌బీసీ(SLBC Tunnel) సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌(Rat Hole Miners)ను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సిల్క్ యారా సొరంగం కుప్పకూలి లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులను.. ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరికోసం ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసి ప్రత్యేకంగా రప్పించింది.

నసీం, ఖలీల్‌ ఖురేషీ, మున్నా, మహమ్మద్‌ రషీద్, ఫిరోజ్‌ ఖురేషీ, మహమ్మద్‌ ఇర్షాద్‌..
ఈ ఆరుగురితో కూడిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సోమవారం ఉదయం వారు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకుని, లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేపట్టనున్నారు.

కేవలం ఒక్కరోజులో బయటికి తెచ్చి..: 2023 నవంబర్‌ 13న సిల్కియారా సొరంగం ముఖ ద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకున్నారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ప్రభుత్వం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ను రంగంలో దింపింది. వారు కేవలం ఒక్క రోజులోనే కారి్మకులను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్న బృందమే ఉత్తరాఖండ్‌ ఆపరేషన్‌లో పాల్గొనడం గమనార్హం.

ఏమిటీ ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌?.

మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారే సహాయక చర్యలకు దిక్కుకానున్నారు..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో 24 మంది సింగరేణి బృందం(Singareni Team), 120 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు(SDRF Teams), ఆర్మీ టీమ్, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు..సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లాయి. మరో కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు అడ్డంకిగా మారాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సొరంగలో నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్(Tunnel Boring Mission) 80 మీటర్ల వెనక్కి వచ్చినట్లు సమాచారం. టన్నెల్ బోరింగ్ వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. దీంతో చిక్కుకున్న వారి స్పందన కోసం సొరంగంలో రెస్క్యూ టీమ్(Rescue Team) అరుపులు, కేకలతో హోరెత్తిస్తున్నారు. అండర్ వాటర్ స్కానర్లు, లైఫ్ జాకెట్లు ధరించి సొరంగం కూలిన ప్రాంతానికి ఆర్మీ బృందం లోకో ట్రెయిన్ సాయంతో వెళ్తోంది. 14 కిలోమీటర్లలో 12 కి.మీ వరకే ట్రెయిన్ వెళ్లే అవకాశం ఉండగా.. మిగిలిన దూరం నడుచుకుంటూ వెళ్తారా? తిరిగి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

శనివారం ఉదయం పనికోసం టన్నెల్‌లోకి మొత్తం 52మందికి పైగా సిబ్బంది, కార్మికులు వెళ్లగా.. అనుకోకుండా టన్నెల్లో ఒక్కసారిగా నీళ్లు.. మట్టిపెడ్డ కులాయి.. వెంటనే పనులు చేస్తున్న కార్మికులు.. సిబ్బంది ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు వచ్చారు. ముగ్గురు కార్మికులు గాయపడటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మిగతా ఎనిమిది మంది కార్మికులు బయటకు రాలేక, అక్కడే ఉండి పోవడంతో.. అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఆ 8 మంది సురక్షితంగా ఉన్నారా..?? లేదా మట్టి.. నీళ్లల్లో కలిసిపోయారా..!!? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు..