రీల్స్ పిచ్చుతో అతివేగం.. ఘోర ప్రమాదం

అతివేగం.. ఘోర ప్రమాదం

హర్యానాలోని యమునానగర్‌లో అతివేగం, రీల్స్ పిచ్చి ఒకరి ప్రాణాన్ని బలిగొంది. నలుగురు యువకులు స్కార్పియో కారులో రీల్స్ చేస్తూ 100 కిలోమీటర్ల పైగా వేగంతో వెళ్లారు. ఈ క్రమంలో అస్గర్‌పూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న థార్ కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో హృతిక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వీడియో వైరలవుతోంది.