ఆక్వా చెరువులపై సంచరిస్తున్న కొండ చిలువ కోసం వేట ,, 38 గుడ్లపై పొదుగుతు రెండు కొండచిలువ దర్శనం..

ఆక్వా చెరువులపై సంచరిస్తున్న రెండు కొండ చిలువలను నూజివీడు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..మంగళవారం కైకలూరు మండలం రామవరంలోని ఓ రొయ్యల చెరువుపై కొండ చిలువ సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన విష సర్పాలను పట్టుకునే జి. ప్రభాకరరావు (మున్నీ)తో కలిసి రామవరం చేరుకున్నారు. కొండ చిలువను వెంబడించి పట్టుకునే క్రమంలో ఆకస్మికంగా గుడ్లు చుట్టూ పొదుగుతూ మరో కొండచిలువ కనిపించింది. అది 38 గుడ్లను పొదుగుతోంది.

దీంతో పాములు పట్టే మున్నీ ఒక్కొక్క దానిని పట్టుకోవడమే గాక వాటి గుడ్లను స్వాధీనం చేసుకు న్నారు. ఈ కొండ చిలువలు సుమారు 20 అడుగులు పొడవున్నాయి. వీటిని అటవీ శాఖ అధికారుల సమక్షంలోనే జంగారెడ్డిగూడెం ఫారెస్ట్‌ ఏరియాలోకి తీసుకువెళ్లి వదిలివేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా కొండ చిలువలు గానీ, భారీ విషసర్పాలు కనిపిస్తే 91776 87948కు సమాచా రాన్ని అందించాలన్నారు. కొంత కాలంగా కొండచిలువ రొయ్యల చెరువు గట్లుపై సంచరిస్తుండడంతో ఆ ప్రాంత రైతులు బిక్కు బిక్కుమంటూ గట్ల వెంబడి ప్రయాణిస్తున్నారు. ఎట్టకేలకు వాటిని స్వాధీనం చేసుకోవ డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు..