కొండా సురేఖకు సీఎం రేవంత్ మరో ఝలక్.!. అటవీ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!

అటవీ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

• మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పలువురు IFS అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు.

• డిప్యూటేషన్‌పై ఉన్న అధికారులను PCCF కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.

తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లురవీ సైతం ఈ వ్యవహరంపై కొండా సురేఖపై చర్యలుంటాయని సంకేతాలు ఇచ్చారు. కొండా సుష్మిత పార్టీలైన్ దాటి మాట్లాడారని కూడా చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక కాసేపటి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనిలో మంత్రి కొండాసురేఖ రచ్చపై మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.ఇది పార్టీ అంతర్గత వ్యవహారామని తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని అన్నారు. పీసీసీ క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అదే విధంగా పీసీసీ డిసిప్లీనరీ కమిటీ ఏవిధంగా నిర్ణయం తీసుకున్న నాయకులు, కార్యకర్తలు పాటించాల్సిందే నంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ హైకమాండ్ సైతం దీనిపై సీరియస్ గా ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.