ఇంగ్లండ్ కాస్త పైచేయి సాధించింది. కానీ రెండో రోజు ఆటలో బౌలర్లు చెలరేగడంతో భారత్ డామినేషన్ నడిచింది. ఆ తర్వాత బ్యాటర్లు కూడా రాణించడంతో డే-2ను సానుకూలంగా ముగించింది భారత్. కానీ శుబ్‌మన్ గిల్ (16), అంతకంటే ముందు కరుణ్ నాయర్ (40) వికెట్లను కోల్పోవడంతో ఎడ్జ్ సాధించలేకపోయింది మెన్ ఇన్ బ్లూ. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది భారత్. మూడ్రోజులు మిగిలి ఉన్న ఈ టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రిజల్ట్ మనకు అనుకూలంగా రావాలంటే మాత్రం ఓ మ్యాజిక్ జరగాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చెమటోడ్చాల్సిందే..
లార్డ్స్ పిచ్ నుంచి పేసర్లకు మంచి మద్దతు లభిస్తోంది. బంతి ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. స్పిన్నర్లకూ కొంతమేర సపోర్ట్ దొరుకుతోంది. ఒక్కోసారి బాల్ ఊహించిన దాని కంటే కిందకు వస్తుండటంతో బ్యాటర్లు షాట్లు ఆడటం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్కోరును దాటాలంటే భారత్ చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. రాహుల్-పంత్ లీడ్స్‌లో చేసిన మ్యాజిక్‌నే మళ్లీ రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు.
ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన..!
రాహుల్-పంత్ ఔట్ అయినా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇంకా క్వాలిటీ బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. అయితే రాహుల్-పంత్‌కు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. దీనికి తోడు ఒకరు డిఫెన్స్‌తో ప్రత్యర్థుల ఓపికను పరీక్షిస్తే, మరొకరు అటాక్ చేస్తూ భయపెడుతుంటారు. కాబట్టి వీళ్లు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడుతూ భారీ భాగస్వామ్యం నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తర్వాతి బ్యాటర్లలో జడేజా తప్పితే మిగతా వారికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. నితీష్, సుందర్ పట్టుదలతో ఆడితే భారీ స్కోర్లు బాదగల సమర్థులే. కానీ రాహుల్-పంత్ ఎక్కువ సేపు ఆడాలని.. ఆ తర్వాత మిగిలిన పనిని తెలుగోడికి అప్పగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…
ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు
36 సిక్సర్లు: రిషబ్ పంత్
34 సిక్సులు: వివ్ రిచర్డ్స్
30 సిక్సర్లు: టిమ్ సౌథీ
27 సిక్సర్లు: యశస్వి జైస్వాల్
26 సిక్సర్లు: శుభ్‌మాన్ గిల్
రోహిత్‌ను సమం
ఇది మాత్రమే కాదు, పంత్ రోహిత్ శర్మ రికార్డును కూడా సమం చేశాడు. పంత్ టెస్టుల్లో సంయుక్తంగా రెండవ అత్యధిక సిక్స్ హిట్టర్‌గా నిలిచాడు. పంత్, రోహిత్ టెస్టుల్లో 88-88 సిక్స్‌లు కొట్టారు. ఈ జాబితాలో 103 టెస్టుల్లో 90 సిక్స్‌లు కొట్టిన వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో ఉన్నారు.
టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు
వీరేంద్ర సెహ్వాగ్: 90
రోహిత్ శర్మ: 88
రిషబ్ పంత్: 88
ఎంఎస్ ధోని: 78
రవీంద్ర జడేజా: 72.
145/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ బ్యాటర్స్ రిషభ్ పంత్(112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), కేఎల్ రాహుల్(177 బంతుల్లో 13 ఫోర్లతో 100) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. లంచ్ బ్రేక్‌కు ముందే పంత్ రనౌటవ్వగా.. నితీష్-జడేజా 6 వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు..