కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం!

కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం!
స్కూల్ బస్సు-కారు ఢీ..

“”గైనకాలజిస్ట్ డాక్టర్ దాసరి విజయ్ కుమార్ మృతి””.

జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై ప్రమాదం.
కల్వకుర్తి సమీపంలో జరిగిన విషాద ఘటన.

షటిల్ ఆడి తిరిగి వస్తుండగా ప్రమాదం.
ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీ కొట్టింది.

కారులో తీవ్రంగా ఇరుక్కున్న వైద్యుడు.

తలకు,గుండె పక్కన తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.

మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు.
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా సేవలు.

వందలాది నార్మల్ డెలివరీలు చేసి మంచి పేరు.
ప్రజల మన్ననలు పొందిన వైద్యుడి మృతి పట్ల విషాదం.

ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా చేరుకున్న ప్రజలు.
వైద్యులు,సిబ్బంది కన్నీరుమున్నీరు
కల్వకుర్తిలో విషాద ఛాయలు.

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాయచూర్ – కోదాడ జాతీయ రహదారిపై ఉన్న సీబీఎం కళాశాల సమీపంలో ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు, కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను కల్వకుర్తిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గత మూడేళ్లుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన పట్టణ సమీపంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆవరణలో వ్యాయామం ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే ఒక వైద్యుడు ఇలా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం స్థానికులను, తోటి వైద్య సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

విజయ్ కుమార్ మృతితో ఆయన కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆయన భార్య యశ్వంత్ రాణి కూడా వృత్తిరీత్యా వైద్యురాలే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయ్ కుమార్ మృతి పట్ల పలువురు వైద్యులు, రాజకీయ నేతలు మరియు పట్టణ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.