టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి.
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
రేపు ఉ.10 గంటలకు ప్రమాణం చేయనున్న విజయ్..
నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం.
బల నిరూపణ కోసం మూడు రోజుల గడువు
టీవీకేకు కాంగ్రెస్, CPI, CPM, VCK, IUML మద్దతు.
TVK-107, కాంగ్రెస్-5, CPI-2, CPM-2, VCK-2, IUML-2
ఐదు పార్టీల మద్దతుతో 120కి చేరిన టీవీకే బలం...
తమిళనాడులో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ అర్లేకర్ను విజయ్ రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించారు. మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు…
గవర్నర్ను విజయ్ కలవడం ఇది మూడోసారి. విజయ్ రెండు చోట్ల గెలవడంతో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమైంది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఆ బలం 112కు చేరింది. ఈ క్రమంలో ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ, సీపీఎం సైతం బేషరుతుగా టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మెజారిటీ అవసరమైన 118 మంది సభ్యుల బలం టీవీకే సంపాదించగలిగింది. దీనికితోడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల బలం 120కి చేరుకుంది…