నేషనల్ హైవే 65వ జాతీయ రహదారిపై వేరువేరు ప్రాంతాలలో వరుస రోడ్ ప్రమాదం ఇద్దరు మృతి..

నేషనల్ హైవే 65వ జాతీయ రహదారిపై వేరువేరు ప్రాంతాలలో వరుస యాక్సిడెంట్లు ఇద్దరు మృతి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం గ్రామ శివారులో బైక్ ను వెనుక నుండి ఢీకొన్న లారీ. బైక్ పై వెళ్తున్న బద్రి రాములు వయసు 28 అక్కడికక్కడే మృతి.
హైదరాబాద్ నుండి సూర్యాపేట కు బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు పంతంగి గ్రామ శివారులో ఎదురుగా వెళ్తున్న DCM ను వెనుకనుండి డీ కొట్టడంతో నోముల దీపక్ (వయస్సు 25 రాంపురం గ్రామం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా) అక్కడికక్కడే మృతి. బైక్ మధ్యలో కూర్చున్న దున్నపోతు శ్రీకాంత్ (అన్నారి గూడెం మోతే మండలం) తలకు,నడుముపై తీవ్ర గాయాలతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ చివర కూర్చున్న చీమ ఉదయ్ (జిగనాధ పురం మంగళ మండలం) సాయంత్ర 8గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి శుభకార్యానికి వెళ్తూ చౌటుప్పల్ మద్యం సేవించి వెళుతూ రోడ్ ప్రమాదానికి గురై మృతి చెందాడు.ఘటన స్థలాలకు చేరుకున్న పోలీసులు మృత దేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.