*క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా*
క్యాన్సర్ పేషంట్లకు గుడ్ న్యూస్..
Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది.
ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది.
లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది.
ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్‌లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది.
దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.
నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచాన్ని శరవేగంగా కబలిస్తున్న ఈ మహమ్మారి ఇటీవలి కాలంలో వయస్సు తారతమ్యం లేకుండా అందరూ దాని బారినపడుతూనే ఉన్నారు. ప్రతిఏటా దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి సోకిందంటే దీని నుంచి బయటపడటం చాలా కష్టం. చికిత్స తీసుకుంటూనే మరెన్నో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చికిత్స కూడా అంత ఈజీ కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి వస్తుంది. తగ్గినట్లు అనిపించినా..మళ్లీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. .రష్యా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ కు టీకాను తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఉపశమనం కల్పించే వార్త అవుతుంది. పౌరులందరికీ ఉచితంగా అందుబాటులో ఉండే క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు రష్యా తెలిపింది. సోమవారం (డిసెంబర్ 16), రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుండి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం, రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి రష్యన్ రేడియో ఛానెల్లో సమాచారం అందించారు…ఇప్పటికే మార్కెట్లో ఉన్న క్యాన్సర్ వ్యాక్సిన్లు లండన్ లో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడానికి జర్మన్ బయోటెక్నాలజీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ & కంపెనీ ప్రస్తుతం చర్మ క్యాన్సర్ వ్యాక్సిన్లపై పనిచేస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి వ్యతిరేకంగా వ్యాక్సిన్లు వంటి క్యాన్సర్‌ను నిరోధించే లక్ష్యంతో ఇప్పటికే మార్కెట్లో ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.