41రోజుల పాటు మండల పూజ..
ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
Sabarimala Temple.
కేరళ (Kerala)లోని శబరిమలలో గల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) ఆలయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో నిర్వాహకులు ఆలయాన్ని తెరిచారు. సోమవారం నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పించనున్నారు.
ప్రతి యేటా అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భక్తులు స్వామి మాల ధరిస్తున్నారు. మకర విళక్కు సీజన్లో అయ్యప్పను దర్శించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ ఏడాది సైతం భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు..
*సోమవారం నుంచి భక్తులకు అనుమతి..*
ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్లు వద్ద అధి (పవిత్ర మంట)ను వెలిగిస్తారు. సుమారు 6.30 గంటలకు ప్రధాన పూజారి ఆలయంలో అభిషేక కార్యక్రమం జరిగింది. ఆదివారమే ఆలయాన్ని తెరిచినప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ మొదలవుతుంది. ఆ రోజు నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తారు.
41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు..Sabarimala Temple | యాత్రికులకు బీమా
శబరిమల సందర్శించేటప్పుడు గుండె జబ్బుతో మరణించే యాత్రికుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం అందించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఎటువంటి ప్రీమియం లేకుండా వర్చువల్ క్యూలను బుక్ చేసుకునే వారందరికీ రూ. 5 లక్షల ప్రమాద బీమా (Accident insurance)ను వర్తింపచేయనున్నారు. యాత్రికులు మరణిస్తే వారిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి అంబులెన్స్ ఖర్చులను కూడా దేవస్థానం బోర్డు భరిస్తుంది.
Sabarimala Temple | నీలక్కల్లో పార్కింగ్
యాత్రికుల వాహనాలను నీలక్కల్ ప్రాంతంలో పార్కింగ్ చేయాలి. . పంప నుంచి నీలక్కల్ 23 కి.మీ దూరంలో ఉంది. నీలక్కల్లో 8,500 వాహనాలను పార్క్ చేయొచ్చు. పంపాలోని హిల్టాప్, చక్కుపాలెం వద్ద కొన్ని చిన్న వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి..