యాదాద్రి భువనగిరి జిల్లా:
రికార్డు స్థాయిలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆదాయం..
ఈ ఒక్క రోజే కోటి నాలుగు లక్షల ఆదాయం సమకూరింది..
ఈరోజు దర్శించుకున్న భక్తుల సంఖ్య 1,06,700..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి రావడంతో ఆదాయం పెరిగింది. ఆదివారం ఒక్కరోజే ఆదాయం కోటి రూపాయలు దాటింది. ఇంత ఆదాయం రావడం ఇది రెండోసారి అని ఆలయ అధికారులు తెలిపారు..యాదాద్రిలో సండే సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శించుకున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు..