హైదరాబాద్: ఓఎంసీ కేసులో తనకు న్యాయం జరిగిందని.. నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మాజీ మంత్రి, భారాస శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె నాంపల్లి కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పన్నెండున్నర సంవత్సరాల క్రితం ఈ కోర్టు మెట్లను కన్నీళ్లతో ఎక్కా. ఏ తప్పూ చేయకపోయినా కేసులో ఉన్నాననే బాధ నాడు కలిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్మా.. నేడు అదే జరిగింది. కానీ, పన్నెండున్నర సంవత్సరాల్లో ఏ ఎన్నికలు వచ్చినా నన్ను అవినీతిపరురాలని, జైలుకు వెళతానని అనేక మంది రాజకీయంగా అవమానంగా మాట్లాడారు. ఎవరు ఎన్ని మాట్లాడినా నియోజకవర్గ ప్రజలు ఆ ప్రచారాలు నమ్మకుండా నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు. న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని న్యాయస్థానం కల్పించింది’’ అని సబిత పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.