ఇంజెక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..!.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రభుత్వాస్పత్రిలో దారుణం…

ఇంజెక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత…

చిన్న పిల్లల వార్డ్‌లో రోజువారీ లాగే శిశువులకు ఇంజెక్షన్‌ ఇచ్చిన వైద్యులు…

ఇంజెక్షన్‌ ఇచ్చిన అరగంట తర్వాత చిన్నారులకు వాంతులు,విరేచనాలు…

ఐసీయూలో శిశువులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు…

ఒక ఇంజెక్షన్‌ బదులు మరో ఇంజెక్షన్‌ ఇచ్చారని డాక్టర్లతో తల్లిదండ్రుల వాగ్వాదం…

చిన్నారులహెల్త్‌ కండీషన్‌పై తల్లిదండ్రుల ఆందోళన…

వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ చిన్నారులు ఇటీవల దవాఖానాలో చేరారు. రోజూలానే శుక్రవారం సాయంత్రం చిన్న పిల్లల వార్డులో పిల్లలకు వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి చలి, జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌ సిబ్బంది వారిని ఐసీయూకు తరలించారు… బాధితులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ ఘటనతో హాస్పిటల్‌లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఒక ఇంజక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు..