నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..నిండు కుండలా నాగార్జునసాగర్ జలాశయం..!

నల్గొండ జిల్లా.
తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జునసాగర్‌ జలాశయం క్రస్ట్‌గేట్లు నేడు తెరుచుకున్నాయి. 18 సంవత్సరాల తర్వాత నెల ముందుగానే సాగర్‌ నీటిమట్టం గరిష్ఠ స్ధాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ సాగర్‌ నుంచి 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

జులైలోనే నీటిమట్టం పెరగడంతో : ఎగువన భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. జూరాల, శ్రీశైలం ఇప్పటికే నిండగా వస్తున్న ఇన్‌ఫ్లోను క్రస్ట్‌గేట్ల ద్వారా కిందకు వదలుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌కు చేరుకుంటోంది. గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 18 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ తొలిసారి చాలా ముందుగానే నిండింది. సాధారణంగా ఏటా ఆగస్టులో సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈసారి మహరాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాల వల్ల సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

సాగర్ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.60 అడుగులకు చేరుకుంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు…

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద

నిండు కుండలా నాగార్జునసాగర్ జలాశయం

ఇన్ ఫ్లో :2,28,900 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 41,645క్యూసెక్కులు.

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం : 587.20 అడుగులు

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలు

ప్రస్తుత సామర్థ్యం : 305.6242 టీఎంసీలు

ప్రదాన జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.