పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్

పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్

తెలంగాణ : రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరు ఒకింత చికాకు పుట్టిస్తుంది. SMలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పనిపై హైదరాబాద్ CP సజ్జనార్ ఫైరయ్యారు. వేగంగా రైలు వస్తుండగా యువకుడు పట్టాల మధ్య పడుకున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ‘వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్ఠకు చేరిన మూర్ఖత్వం. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండటం నేర్చుకోండి’ అని పేర్కొన్నారు.
https://x.com/SajjanarVC/status/1921383778804490356?s=20టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ ఈ షాకింగ్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. వీడియోలో.. ఒక యువకుడు వేగంగా దూసుకొస్తున్న రైలు పట్టాల మధ్య నిలువుగా పడుకుని ఉన్నాడు. ట్రైన్ వస్తున్నా.. అతడు మాత్రం పిచ్చిగా నవ్వుతూ.. అలాగే ఉన్నాడు. ట్రైన్ దగ్గరుకు రాగానే పట్టాలపై పడుకున్నాడు. రైలు అతనిపై నుంచి వెళ్లిపోయిన వెంటనే అతను లేచి నిలబడి.. ఏదో గొప్ప విజయం సాధించినట్లుగా సంకేతం చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.యువకుడు చేసిన పనిపై తీవ్రంగా స్పందించిన వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ, “ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం సాధించినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు? ఇలాంటివి మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి” అని సజ్జనార్ హెచ్చరించారు.