హీరో సల్మాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ ‘ఉగ్రవాది’గా ప్రకటన..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ ‘ఉగ్రవాది’గా ప్రకటించింది. “రియాద్‌ ఫోరం”కు సంబంధించిన ప్రోగ్రాంలో బలూచిస్థాన్‌పై సల్మాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని పాకిస్థాన్ అంటోంది…సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నగరంలో ఈ అంతర్జాతీయ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. “రియాద్‌ ఫోరం”లో సినిమా, టూరిజం, టెక్నాలజీ, వినోదం, వ్యాపారం వంటి రంగాల ప్రముఖులు పాల్గొని సౌదీ విజన్‌ 2030 కింద దేశ అభివృద్ధి, ప్రపంచ భాగస్వామ్యాలపై మాట్లాడతారు.

బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల పాల్గొన్న జోయ్‌ ఫోరం 2025 కూడా అలాంటి కార్యక్రమమే. ఇది సౌదీ వినోద శాఖ నిర్వహించే వార్షిక గ్లోబల్‌ ఈవెంట్‌..