సాఫ్ట్వేర్ సంస్థ విప్రో పూణేలోని హింజేవాడి క్యాంపస్లో మత మార్పిడి సెగలు..!

సాఫ్ట్వేర్ సంస్థ విప్రో పూణేలోని హింజేవాడి క్యాంపస్లో మత మార్పిడి సెగలు రేగుతున్నాయి. అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసిన ఒక మహిళా ఉద్యోగిని, తనపై ఉన్న లేడీ బాస్ మతపరమైన వేధింపులకు గురిచేసిందని, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ పూణే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు..బెంగళూరులో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సదరు మహిళా బాస్పై ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్పందించిన విప్రో సంస్థ, తాము పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, అవసరమైన అన్ని రికార్డులను పూణే పోలీసులకు అందజేశామని ప్రకటించింది..