టెన్త్ క్లాస్ తరగతి గదిలో ఆవు మెదడు (బ్రెయిన్) ప్రత్యక్షంగా చూయించిన సైన్స్ టీచర్ వ్యవహారం పై హిందువాదులు మండిపడ్డారు. వివరాల్లోకెళితే వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ యాలాల మండలం పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘోరం చోటు చేసుకుంది..స్థానిక సైన్స్ టీచర్ ఖాసీం బి పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి ఆవు మెదడుని తీసుకొని వచ్చి విద్యార్థులకు బ్రెయిన్ ఇలా ఉంటుందని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఫోజులిచ్చింది. ఇది గ్రహించిన కొందరు విద్యార్థులు ఆగ్రహించారు.
అయినా టీచర్ వినకుండా ఈ ఫోటోలను స్కూల్ గ్రూపులో కూడా పోస్ట్ చేసింది. తీరా ఈ విషయం పక్కనున్న టీచర్లకు తెలియడంతో టీచర్ను గట్టిగా నిలదీయడంతో ఫోటోలను డిలీట్ చేసింది. ఆ తర్వాత ఎవరికైనా చెప్పుకోండి అని దురుసుగా తోటి టీచర్ సమాధానం ఇచ్చింది. ఈ విషయం కాస్త బయటపడడంతో బుధవారం బీజేపీ నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని హిందూ వాదులతో కలిసి స్కూల్ ముందు ధర్నాకు దిగారు. టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఇలాంటి చేష్టలు చేయడం తప్పని హెచ్చరించారు. స్కూల్ టీచర్ ఉండి ప్రత్యక్షంగా ఇలా బ్రెయిన్ చూపించడం, అది కూడా ఆవు ది అని చెప్పడం ఏమిటని ప్రశ్నించి ధర్నాకు దిగారు. ఈ విషయంపై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు సద్దుమణిగారు..